దసరా పండుగ సందర్భంగా సొంతఊళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేటు ట్రావెల్స్ అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ సంయుక్త కమిషనర్ ఎస్. వెంకటేశ్వరరావు హెచ్చరించారు. దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రైవేటు ట్రావెల్స్ అధిక ఛార్జీల వసూళ్లపై ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలపై వందకు పైగా కేసులు నమోదు చేశామన్నారు.
దసరా సీజన్ మొత్తం ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందన్నారు. పన్నులు ఎగ్గొట్టే ట్రావెల్స్‌పై కఠినంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వెబ్ సైట్ల ద్వారా అధిక ఛార్జీలు వసూలు చేస్తే తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ వారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తే రవాణా శాఖ వెబ్సైట్లో పొందుపరచిన డీటీసీలకు నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి: ACHENNAIDU: 'విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకూ పోరాటం చేస్తాం'