ETV Bharat / city

RRR Movie: 'తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా ఆర్ఆర్​ఆర్​ '... అభిమానుల సందడే సందడి - ఏపీలో RRR movie resale

Fans on RRR Movie: పండుగలన్నీ ఒకేసారి వచ్చేశాయి అన్నట్లు సందడే సందడి... దీపావళి కాకపోయినా ఎటూ చూసినా టపాసుల మోతే.. అభిమానులకు పూనకాలే పూనకాలు.. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి " రౌద్రం...రణం...రుధిరం" అంటూ తెరకెక్కించిన ఆర్​ఆర్​ఆర్​ సినిమా విడుదల వేళ థియేటర్ల వద్ద సంబరాలు అంబరాన్ని అంటాయి. విడుదలైన అన్ని చోట్లా సినిమాకు మంచి స్పందన రావడంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు. అంతటా ఆర్‌.ఆర్‌.ఆర్‌. మేనియా నెలకొంది.

Fans on RRR Movie
ఆర్ఆర్​ఆర్
author img

By

Published : Mar 25, 2022, 10:58 PM IST

'తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా ఆర్ఆర్​ఆర్​ '... అభిమానుల సందడే సందడి

RRR Movie: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన త్రిపుల్ ఆర్ సినిమా థియేటర్ల వద్ద అభిమానులు సందడితో తిరునాళ్ల వాతావరణం నెలకొంది .అభిమానులంతా గురువారం అర్థరాత్రినుంచే సినిమాహాళ్ల వద్ద పడిగాపులు కాశారు. ఉదయం నుంచి బెనిఫిట్‌ షోలు ప్రారంభంకావడంతో అభిమానుల కేరింతలుకొట్టారు. థియేటర్ల వద్ద హీరోల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టారు. బాణసంచా కాల్చి సందడి చేశారు. డీజేలు పెట్టి పెద్ద ఎత్తున డాన్సులు చేస్తూ అభిమానాన్నిచాటుకున్నారు . సినిమాకి మంచి టాక్‌ రావడంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపు అయ్యింది.

Fans Halchal : గుంటూరు నగరంలోని థియేటర్లు వద్ద ఎన్టీఆర్, రామ్ చరణ్ కటౌట్‌లకో పాలాభిషేకం చేసి హారతులుఇచ్చారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి అభిమానాన్ని చాటుకున్నారు. దుగ్గిరాలలో సింగిల్ సిలిండర్ కలిగిన వినియోగదారులకు మరో సిలిండర్ తీసుకోవడానికి అనుమతించటంతోపాటు ఆర్​ఆర్​ఆర్​ సినిమా టికెట్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించడంతో చాలామంది అదనపు సిలెండర్‌ తీసుకున్నారు.

అభిమానులు భారీగా ర్యాలీ: కృష్ణా జిల్లా నందిగామలో భారీ కేక్‌ను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కట్ చేసి అభిమానులకు పంచారు. అనంతరం అభిమానులతో కలిసి సినిమా చూశారు. జగ్గయ్యపేట, ఉయ్యూరు, పెనుగంచిప్రోలులో ఎన్టీఆర్ అభిమానులు భారీగా ర్యాలీ నిర్వహించారు.విజయవాడ, కైకలూరులో థియటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. బెనిఫిట్‌ షోలకు భారీగా అభిమానులు తరలివచ్చారు. డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. ఎన్టీఆర్, రాంచరణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ కేకు కోశారు.

రాయలసీమలో సందడే సందడి: రాయలసీమ వ్యాప్తంగానూ మెగా, నందమూరి అభిమానులు సందడి చేశారు. అనంతపురంలోని థియేటర్లలో ఉదయం ఐదు గంటలకే బెనిఫిట్స్ షోలను ప్రదర్శించారు.రాత్రి నుంచి అభిమాన హీరోలకు పాలాభిషేకాలు చేసి భారీ గజమాలతో అలంకరించారు. అదే సమయంలో ఓ అభిమాని ఎస్వీ థియేటర్ లో సినిమా చూస్తూ కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు. మృతుడు అనంతపురంలోని అంబేడ్కర్‌ నగర్ కు చెందిన ఓబులేసుగా గుర్తించారు. .కడప నగరంలోని ఏడు థియేటర్లలో సినిమా విడుదలవగా .. సాయిబాబా థియేటర్ వద్ద అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

అభిమానుల కోలాహలం: నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని 2 థియేటర్లలో ఆర్​ఆర్​ఆర్​ సినిమా చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ప్రకాశం జిల్లా చీరాలలో ర్యాలీ నిర్వహించి.. అభిమాన నటులకు జైకొట్టారు. ఆర్​ఆర్​ఆర్​ సినిమాకు కర్నూలు జిల్లాలో మంచి స్పందన లభించింది. ఉదయం నుంచే థియేటర్ల వద్ద అభిమానుల కోలహలం మొదలైంది. సినిమా బాగుందని టాక్ రావడంతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు బాణ సంచా కాల్చి నృత్యాలు చేశారు.

యానాంలో అభిమానులు హంగామా: విశాఖ, శ్రీకాకుళంలోనూ అభిమానుల కేరింతలతో హోరెత్తించారు. విశాఖలో వెయ్యి కొబ్బరికాయలు కొట్టారు. యానాంలో థియటర్ల వద్ద అభిమానులు హంగామా చేశారు. కథానాయకుడు కార్తికేయ ఎవరికీ తెలియకుండా వచ్చి సినిమాను తిలకించి వెళ్లిపోయాడు..తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అన్నపూర్ణ థియేటర్‌లో తుపాకీతో ఓ అభిమాని హల్‌చల్‌ చేశారు. థియేటర్‌లో తెరముందు తుపాకీతో తిరుగుతూ ఉండగా ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని.. తుపాకి డమ్మీదని తేల్చారు.

థియేటర్లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ!:విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్​లో ఆర్​ఆర్​ఆర్​ సినిమా ప్రదర్శనలో ఆటంకం ఏర్పడింది. షో ప్రారంభమైన గంట సేపటి తర్వాత స్క్రీన్​ నిలిచిపోయింది. దీంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంతసేపటికీ సినిమా స్టార్ట్ కాకపోయేసరికి.. థియేటర్​లోని ఫర్నిచర్​ను ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

Lokesh TWeet: ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులు బద్దలు కొట్టాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆకాంక్షించారు. సినిమాకు వచ్చిన హిట్‌టాక్‌పై సంతోషాన్నివ్యక్తం చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు అభినందనలు తెలిపారు. ఈ వారంలో కుటుంబ సమేతంగా సినిమాను తప్పకుండా చూస్తానన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.