ETV Bharat / city

ACB raids: రాష్ట్రంలో ఏసీబీ దాడులు... పలుచోట్ల రికార్డులు స్వాధీనం - రాష్ట్రంలో ఏసీబీ తనిఖీలు

ACB raids: రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్టీఆర్‌, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు.

ACB raids
ఏసీబీ దాడులు
author img

By

Published : Aug 4, 2022, 6:28 PM IST

ACB Raids: రోజురోజుకు అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు పెరుగుతుండటంతో అనిశా అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో అక్రమ నిర్మాణాలపై ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 30మంది అధికారులు సోదాలు చేపట్టారు. ఉద్యోగుల బీరువాలు, పర్సులు తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న నగదును లెక్కించి స్వాధీనం చేసుకున్నారు. విధులకు హాజరుకాని వారిని ఫోన్‌ చేసి పిలిపించే ఏర్పాట్లు చేశారు.

కాకినాడ జిల్లా సామర్లకోట పురపాలక సంఘ కార్యాలయంలో అనిశా అధికారులు తనిఖీలు నిర్వహించారు. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాల్లో రికార్డులను పరిశీలించారు. అనిశా అదనపు ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో సిబ్బంది సోదాలు నిర్వహించారు.

ఏలూరు జిల్లా నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక విభాగంలో రికార్డులు పరిశీలించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసిబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్‌ కార్యాలయంలోనూ అనిశా అధికారులు తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని దస్త్రాలను పరిశీలించారు. విజయనగరంలోని బొబ్బిలిలో పురపాలిక కార్యాలయం తలుపులు మూసేసి అనిశా విజయనగరం డీఎస్పీ ఆధ్వర్యంలో 12 మంది బృందం తనిఖీలు నిర్వహించింది.

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసిబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. 14400 ఫోన్ చేసిన,యాప్ కు సమాచారం అధించించిన వాటిపై ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. టౌన్ ప్లానింగ్ విభాగలో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.