బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు తెలంగాణ, మహారాష్ట్రల మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించింది. దాని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసినట్లు వాతావరణశాఖ తెలియచేసింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరుల్లో ఆకాశం మేఘావృతమై కొద్దిపాటి వర్షం కురిసింది.
రాష్ట్రంలో ఈరోజు నమోదైన వర్షపాతం, ఉష్ణోగ్రత వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
వర్షపాతం వివరాలు:
ప్రాంతం | వర్షపాతం (సెం.మీలలో) | ప్రాంతం | వర్షపాతం (సెం.మీలలో) |
గార్లదిన్నె (అనంతపురం) | 9.7 | పెదపాడు ( ప.గో) | 4.9 |
చుండూరు (గుంటూరు ) | 8.4 | రాజమహేంద్రవరం | 4.1 |
నూజివీడు ( కృష్ణా) | 7.7 | చీరాల | 3.5 |
గన్నవరం | 7.5 | ఒంగోలు | 3.0 |
మారేడుమిల్లి | 7.1 | గుంటూరు | 2.5 |
నర్సీపట్నం | 5.7 | ------ | ------- |
ఉష్ణోగ్రత వివరాలు:
ప్రాంతం | ఉష్ణోగ్రత (డిగ్రీలలో) | ప్రాంతం | ఉష్ణోగ్రత (డిగ్రీలలో) |
అమరావతి | 38 | ఏలూరు | 33 |
తిరుపతి | 37 | విశాఖపట్నం | 32 |
నెల్లూరు | 37 | అనంతపురం | 32 |
గుంటూరు | 36 | కర్నూలు | 32 |
విజయవాడ | 35 | రాజమహేంద్రవరం | 31 |
విజయనగరం | 35 | కాకినాడ | 31 |
ఒంగోలు | 35 | శ్రీకాకుళం | 31 |
కడప | 34 | ------- | -------- |
ఇదీ చడవండి: నీట్ పరీక్ష ఫలితాలు విడుదల