RTI STATE CHIEF : అక్టోబర్ 12 వరకు రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీఐ రాష్ట్ర చీఫ్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. నెలలో ప్రతీ మూడో శుక్రవారం ఆర్టీఐ డేగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తులు, అప్పీల్స్ పరిష్కరించాలని సూచిస్తున్నట్లు వివరించారు. ఆర్టీఐ ద్వారా 23 వేల ఫిర్యాదులు వస్తే.. అందులో 19 వేల కేసులు పరిష్కృతమయ్యాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 గ్రామాలను ఎంపిక చేసి.. న్యాయ కళాశాలల విద్యార్థుల ద్వారా సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.
"అక్టోబర్ 12 వరకు రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం వారోత్సవాలు. నెలలో ప్రతి మూడో శుక్రవారం ఆర్టీఐ డేగా నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తులు పరిష్కరించాలని సూచిస్తున్నాం. 23 వేల ఫిర్యాదులు వస్తే 19 వేల కేసులు పరిష్కారమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 25 గ్రామాలను ఎంపికచేసి.. న్యాయ కళాశాలల విద్యార్థుల ద్వారా అవగాహన కల్పిస్తాం" -శ్రీనివాసరావు, ఆర్టీఐ రాష్ట్ర చీఫ్ కమిషనర్
ఇవీ చదవండి: