పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర జలశక్తి శాఖతో కీలక భేటీ జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, కార్యదర్శితో సమావేశమైన రాష్ట్ర అధికారులు.. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం డిజైన్లపై చర్చించారు. దిగువ కాఫర్ డ్యాం డిజైన్ ఖరారు చేశామని.. మిగతా డిజైన్లపై నిపుణులతో చర్చించి వారంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమావేశంలో రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ఈ డిజైన్‌పై ఈ నెల 25లోగా స్పష్టత ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరినట్లు సమాచారం. అలాగే.. ఈ నెల 25 తర్వాత మరోసారి సమీక్ష జరపాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: