ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్(PCV) డ్రైవ్‌ను వైద్యారోగ్యశాఖ ప్రారంభించింది. నెలల చిన్నారికి సీఎం జగన్ సమక్షంలో వైద్యారోగ్యశాఖ సిబ్బంది పీసీవీ వ్యాక్సిన్‌ను వేశారు. పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు పీసీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకూ పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్‌లను వైద్యారోగ్యశాఖ అందిస్తోంది. కొత్తగా ఇస్తున్న న్యుమోకోకల్ వ్యాక్సిన్‌తో కలిపి ఇక నుంచి 10 రకాల వ్యాక్సిన్‌లను పిల్లలకు ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Mega Vaccinedrive: గుంటూరులో కొనసాగుతున్న మెగా వ్యాక్సిన్ డ్రైవ్