ETV Bharat / city

అందుకే కొత్త వారికి వ్యాక్సిన్ ఇవ్వలేకపోతున్నాం: సింఘాల్

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై తనిఖీలు చేసేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్​ బృందాలను నియమించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్​ను కేంద్రం కేటాయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రెండో డోసు టీకా మాత్రమే ఇస్తున్నామని, అందుకే కొత్తవారికి వ్యాక్సిన్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్

author img

By

Published : May 8, 2021, 10:07 PM IST

ప్రతి జిల్లాలో ఐదారు ప్రైవేటు ఆస్పత్రులను క్లస్టర్​గా విభజించి ఆకస్మిక తనిఖీలు చేసేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్​ బృందాలను నియమించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. పలు జిల్లాల్లో నిబంధనలు ఉల్లఘించిన ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు, మరికొన్ని జిల్లాల్లో సాధారణ కేసులు నమోదు చేశామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో రెమ్​డెసివిర్​ను బ్లాక్​లో విక్రయించిన వారిని, నకిలీ రెమ్​డెసివిర్ కలిగి ఉన్నవారిని పట్టుకున్నట్లు సింఘాల్ వెల్లడించారు.

రాష్ట్రానికి కేంద్రం సాయం..

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున అవసరాలకు సరిపడా 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్​ను కేంద్రం కేటాయించిందని అనిల్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగశాల కేంద్రంలో సుమారు 100 టన్నుల ఆక్సిజన్ నిల్వలు ఉన్నట్లు గుర్తించామని, వాటిని కేటాయిస్తే నెల్లూరు జిల్లాకు ఉపయుక్తంగా ఉంటుందని సింఘాల్ వెల్లడించారు.

అందుకే ఇవ్వలేకపోతున్నాం..

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ టీకా కోసం వస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న సింఘాల్.. కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్ రెండో డోస్ అవసరమైన వారికి మాత్రమే ఇస్తున్నామన్నారు. ఫలితంగా కొత్త వారికి ఇవ్వలేకపోతున్నట్లు ప్రకటించారు. వ్యాక్సిన్ కోసం కేంద్రం రూపొందించిన కొవిన్ అప్లికేషన్​లో మార్చులు చేయాలని కేంద్రాన్ని కోరామని, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారా టీకాలు పంపిణీ చేస్తామని కేంద్రానికి తెలిపినట్లు వివరించారు.

662 ఆస్పత్రుల్లో వైద్య సేవలు..

కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉండేందుకు విశాఖ ఉక్కు పరిశ్రమతో పాటు నేవీ కూడా ముందుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 662 ఆస్పత్రుల్లో కొవిడ్ వైద్య సేవలు అందిస్తున్నాట్లు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు.

ఇవీచదవండి.

జగన్ కంటే.. జార్ఖండ్ సీఎం ఎంతో పరిణతి కలవారు: జేఎంఎం

భారత సైన్యంలోకి తొలి మహిళా బ్యాచ్​ జవాన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.