రాష్ట్రంలో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో రోగులకు అత్యవసరంగా అందించే ఆక్సిజన్ నిల్వలను సమకూర్చే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. వాయుసేన కార్గో విమానాల ద్వారా ఇతర రాష్ట్రాలకు నిత్యం 2 నుంచి 4 ఖాళీ ట్యాంకర్లను తరలిస్తున్నారు. రోడ్డు మార్గంలో అధిక సమయం పట్టడంతో అత్యవసర సేవల దృష్ట్యా వాయుమార్గంలో తెప్పిస్తున్నారు.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిన్న అర్ధరాత్రి రెండు, ఈ రోజు రెండు చొప్పున ట్యాంకర్లు ఒడిశా బయలుదేరాయి. ఆక్సిజన్ నిల్వలతో 'గ్రీన్ ఛానల్' ద్వారా రోడ్డు మార్గంలో రాష్ట్రానికి చేరనున్నాయి. అనంతరం కొవిడ్ అత్యవసర సేవలు అందించే అన్ని ప్రాంతాలకు అధికారులు వాటిని తరలించనున్నారు.
ఇదీ చదవండి:
కేంద్రం ఇచ్చిన నిధుల్లో సగం ఖర్చు చేసినా వాక్సిన్లు కొనుగోలు చేయెచ్చు: పట్టాభి