కల్తీ ఆహారం - మానవాళి మనుగడ అనే అంశంపై సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ ఆధ్వర్యంలో ప్రజాచైతన్య సదస్సును విజయవాడలో ఆదివారం ఏర్పాటుచేశారు. కల్తీని అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో మేథావులు చర్చించారు. ఆహార నిబంధనలు పాటించని హోటళ్లు ,రెస్టారెంట్లు, వ్యాపారుల అక్రమ దందాను నియంత్రించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఆహారభద్రత అధికారులు పలు చోట్ల తనిఖీలు చేపట్టి శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం తెలంగాణకు పంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కనీసం ల్యాబ్ ఏర్పాటుచేయకపోవటం ఏంటని అసహనం చెందారు.
''కొన్ని ఆహార పదార్ధాల్లో రసాయనాలు కలుపుతున్నారని ఆహారభద్రత అధికారులు చెపుతున్నారు. కృష్ణా జిల్లా పరిధిలో ఏడాదిలో 370 శాంపిళ్లు సేకరించి పరీక్ష చేయగా 120 నమూనాల్లో కల్తీ ఉందని తేలింది. వాటికి సంబంధించి 120 కేసులు నమోదు చేశారు. వినియోగదారులు ఆహార పదార్ధాలు కొనుగోలు చేసేటప్పుడు స్వీయ పరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై చర్యలు తీసుకోవాలి'' అని ప్రజాసంఘాలు చెప్పాయి.