17 నెలల వైకాపా పాలన శంకుస్థాపనలకే పరిమితమైందని.... అభివృద్ధి శూన్యమని తెదేపా ఎంపీ కేశినేని నాని దుయ్యబట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి 2వ డివిజన్ కార్మిక నగర్ కొండ ప్రాంతంలో ఎంపీ నాని ఆదివారం పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెదేపా అంటే అభివృద్ధి, సంక్షేమానికి పెట్టింది పేరని నాని అన్నారు. కొండ ప్రాంతంలో నివాసముంటున్న వారి కోసం మరుగుదొడ్ల నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి 7 లక్షల రూపాయలు కేటాయించామని చెప్పారు. వైకాపా పాలనలో వార్డు స్థాయిలో కూడా అభివృద్ధి ఊసే లేదని నాని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్క దారి పట్టిస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. కొండ ప్రాంత వాసులు, దళితుల కోసం తెదేపా హయాంలో ప్రారంభించిన పనులను... వైకాపా ప్రభుత్వం పూర్తి చేయడం లేదని విమర్శించారు.
ఇదీ చదవండి