కరోనా కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మిషన్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని వ్యవసాయరంగంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టిసారించారని అన్నారు. పంటలకు మద్దతు ధర, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అన్ని అంశాలపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు. ఈనెల 20 తర్వాత వ్యవసాయ రంగానికి మరిన్ని సడలింపులు ఉంటాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి..