ETV Bharat / city

'ఆర్​ఆర్​ఆర్'​కు ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు: రాజమౌళి

'ఆర్​ఆర్​ఆర్' భారీ బడ్జెట్​తో రూపొందించిన సినిమా కనుక.. సినిమాకు ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు దర్శకధీరుడు రాజమౌళి వెల్లడించారు. ఈనెల 25 'ఆర్​ఆర్​ఆర్' విడుదల కానున్న నేపథ్యంలో సీఎంతో రాజమౌళి, నిర్మాత దానయ్య భేటీ అయ్యారు.

'ఆర్​ఆర్​ఆర్'​కు ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు

author img

By

Published : Mar 14, 2022, 7:17 PM IST

Updated : Mar 14, 2022, 7:37 PM IST

ముఖ్యమంత్రి జగన్‌తో సినీ దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన వారు.. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్​ను కలిశారు. భారీ బడ్జెట్​తో తెరకెక్కిన 'ఆర్​ఆర్​ఆర్' చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సీఎంతో రాజమౌళి సమావేశమయ్యారు. ఈ భేటీలో సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని కూడా పాల్గొన్నారు.

భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన రాజమౌళి.. సీఎం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. 'ఆర్​ఆర్​ఆర్' భారీ బడ్జెట్​తో రూపొందించిన సినిమా కనుక.. సినిమాకు ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు రాజమౌళి వెల్లడించారు.

'ఆర్​ఆర్​ఆర్'​కు ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు

ఇదిలా ఉండగా.. తమ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో ప్రకారమే సినిమా టిక్కెట్ల ధరలు ఉంటాయని.., ఎవరికీ ప్రత్యేక మినహాయింపులు ఉండవని పేర్ని నాని అన్నారు. చిన్న సినిమాల పోటీ లేకపోతే పెద్ద సినిమాలు ఐదు ఆటలు వేసుకోవచ్చునన్నారు. రాష్ట్రంలో 1100 థియేటర్లలో పెద్ద సినిమాలు ఉంటే ఒక షో మాత్రం చిన్న సినిమాకు ఉందన్నారు. సినిమా టికెట్లకు సంబంధించిన జీవో ఇచ్చినందుకు రాజమౌళి, దానయ్యలు సీఎం జగన్​కు ధన్యవాదాలు తెలిపారని అన్నారు.

మార్చి 25న ప్రేక్షకుల ముందుకు..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్​ఆర్'​..మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకు రానుంది. రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.

ఇదీ చదవండి మహీంద్రా ఆఫీస్​లో 'ప్రాజెక్ట్​ కె'.. తొలి భారతీయ చిత్రంగా 'ఆర్​ఆర్​ఆర్​'

Last Updated : Mar 14, 2022, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.