ETV Bharat / city

రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుకి శ్రీశైలం ప్రాజెక్టే ఆధారం: జగన్

author img

By

Published : Oct 7, 2020, 4:45 AM IST

Updated : Oct 7, 2020, 6:47 AM IST

తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై పాలమూరు-రంగారెడ్డి, డిండిని నిర్మిస్తూ...ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలను ఎలా కాదనగలరని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు.అపెక్స్ కౌన్సిల్‌ భేటీలో చర్చించిన అంశాలపై కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్‌షెకావత్‌కు మళ్లీ లేఖద్వారా తెలిపిన జగన్‌..రాయలసీమ ఎత్తిపోతలతో ఆయకట్టు, నీటినిల్వ సామర్థ్యం పెరగడం లేదని పునరుద్ఘాటించారు. గోదావరిపై...తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల కారణంగా దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని లేఖలో జగన్ ఆక్షేపించారు.

రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుకి శ్రీశైలం ప్రాజెక్టే ఆధారం

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఏపీకి రావాల్సిన నీటి వాటాలపై...అపెక్స్ కౌన్సిల్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్..కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు లేఖ రూపంలోనూ వివరాలు సమర్పించారు. తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కోనే.. రాయలసీమ ప్రాంతంలోని 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాకు శ్రీశైలం ప్రాజెక్టు నీరు ఒక్కటే ఆధారమని జగన్ లేఖలో పేర్కోన్నారు. తాగు, సాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలకూ శ్రీశైలం ప్రాజెక్టుపైనే ఆధారపడాల్సి ఉందని...జగన్ స్పష్టం చేశారు. థార్ ఎడారి తర్వాత దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా అనంతపురం ఉందని...ఏడారి అభివృద్ధి పథకం కూడా అక్కడ అమల్లో ఉందని...లేఖలో జగన్ పేర్కొన్నారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు కూడా....దుర్భిక్ష ప్రాంతాల అభివృద్ధి పథకంలో భాగమై ఉన్నాయని.. వలసలు అధికంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలంటే నీరే అత్యంత కీలకమైన వనరని..జగన్ అన్నారు.

కేసీఆర్ అంగీకారం తెలిపారు

తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నా.. 2 జిల్లాలకు 142, 104 టీఎంసీల చొప్పున నీటి కేటాయింపులు ఉన్నాయని...రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరుకు ప్రస్తుతం 50 టీఎంసీలు మాత్రమే ఇస్తున్నట్లు..జగన్ లేఖలో వివరించారు. ఈ ఆరు జిల్లాలకు జిల్లాకో 100 టీఎంసీలు లెక్కన....600 టీఎంసీలు అందించాల్సి ఉందని చెప్పారు. గతేడాది జూన్ 28న జరిగిన భేటీలోనూ..తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవే అంశాలపై అంగీకారాన్ని తెలిపారని జగన్ పేర్కొన్నారు. శ్రీశైలంలో 854 అడుగుల కంటే ఎక్కువ నీటి నిల్వ ఉన్నప్పుడే 7 వేల క్యూసెక్కుల చొప్పున...పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు నీటిని తరలించగలమని స్పష్టంచేశారు.44 వేల క్యూసెక్కుల పూర్తి సామర్ధ్యంతో ఏడాదిలో 15 రోజులు మాత్రమే...నీటిని రాయలసీమకు ఎత్తిపోసే అవకాశముందని అన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ తుది ఆదేశాల మేరకు చెన్నైకు 15 టీఎంసీలు, ఎస్​ఆర్​బీసీకి 19, కెసీ కెనాల్‌కు 10 టీఎంసీల కేటాయింపు ఉందని స్పష్టం చేశారు.

బోర్డు పరిధి కీలకం

పునర్విభజన చట్టం ప్రకారం గాలేరు నగరికి 38, తెలుగుగంగకు 29, వెలిగొండకు 43.5, హంద్రీనీవా 40, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 10....,పైడిపాలెంకు 6, మైలవరంకి 7, సర్వారాయ సాగర్‌కు 3, గోరుకల్లుకి 12.4, అవుకుకి 4.14, సోమశిలకి 78, కండలేరు 68 టీఎంసీల మేర శ్రీశైలం రిజర్వాయర్ పై ఆధారపడి ఉన్నాయన్నారు. ఈ క్రమంలో.. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల పర్యవేక్షణ సక్రమంగా జరిగేందుకు బోర్డు పరిధి కీలకమని జగన్ చెప్పారు. భౌగోళికంగా...నాగార్జున సాగర్ కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ ఏపీ పరిధిలో ఉన్నా ఇంకా తెలంగాణే దాన్ని నిర్వహించటం సరికాదని... తక్షణమే ఏపీకి ఆ బాధ్యతలు అప్పగించాలని జగన్ వ్యాఖ్యానించారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కూడా ఈ 6 జిల్లాలు, చెన్నై తాగునీటి అవసరాలు తీరాకే జరగాలన్నారు. అలాగే ఎనిమిదిన్నర జిల్లాల నీటి వినియోగానికి కీలకమైన...శ్రీశైలం, నాగార్జున సాగర్ నిర్వహణ, నియంత్రణ బాధ్యతల్ని ఏపీకి అప్పగించాలని..,లేదా బోర్డుకు స్పష్టమైన పరిధిని నిర్ధారించాలని కోరుతున్నట్టు సీఎం వెల్లడించారు.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించాలి

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం... కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించాలని విజ్ఞప్తి చేశారు. అటు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ 90 టీఎంసీల సామర్ద్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను, 30 టీఎంసీలు ఎత్తిపోసేందుకు దిండి లిఫ్ట్, 40 టీఎంసీల వరకూ ఎత్తిపోసేందుకు కల్వకుర్తి లిఫ్ట్​ను కొత్తగా నిర్మించిందని జగన్ కౌన్సిల్‌లో ప్రస్తావించారు.సాగునీటి కోసమని 3 టీఎంసీలు, విద్యుత్ కోసమని 4 టీఎంసీల మేర ప్రతి రోజూ శ్రీశైలం నుంచి తెలంగాణ వినియోగించుకునేందుకు సామర్ధ్యాలను పెంచుకుందని..ఈ పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించి 3 టీఎంసీల మేర శ్రీశైలం నుంచి ఎత్తిపోయటం మినహా......ఏపీకి మరో ప్రత్యామ్నాయం లేదని జగన్ స్పష్టం చేశారు.299 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి ఎత్తిపోసేందుకు గతంలో తెలంగాణ కూడా అంగీకరించిందన్నారు.

ఏపీ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం

రాయలసీమ ఎత్తిపోతల ద్వారా..కొత్త నీటి నిల్వ సామర్ధ్యం, కొత్త ఆయకట్టు వచ్చి చేరటం లేదన్నారు. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ద్వారా మహబూబ్ నగర్, నల్గొండతో పాటు ఖమ్మం, వరంగల్ జిల్లాల నీటి అవసరాలు తీర్చాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకొందని జగన్ పేర్కొన్నారు. అటు... గోదావరి నదిపై కాళేశ్వరం, సీతారామ లిఫ్ట్ లాంటి కొత్త ప్రాజెక్టుల ద్వారా.. నీటిని వినియోగించుకుంటున్న తెలంగాణ పోలవరం ప్రాజెక్టు దిగువ నుంచి మళ్లిస్తున్న 80 టీఎంసీల్లోనూ వాటా అడగటం సహేతుకం కాదని జగన్ ఆక్షేపించారు. నూతనంగా నిర్మిస్తున్న వేర్వేరు ప్రాజెక్టుల ద్వారా తెలంగాణా వినియోగించుకునే గోదావరి జలాల వినియోగం 13వందల35 టీఎంసీలకు పెరుగుతుందని జగన్ చెప్పారు. దిగువ రాష్ట్రమైన ఏపీ ప్రయోజనాలకు ఇది తీవ్ర విఘాతం కలిగిస్తుందని, కేంద్ర జలసంఘం, గోదావరి నదీ యాజమాన్య బోర్డు అనుమతి ఉంటే తప్ప..ప్రాజెక్టులపై ముందుకు వెళ్లకుండా తెలంగాణను నిలువరించాలని...జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం ప్రతీ ఏటా 1400 టీఎంసీల గోదావరి వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. గతంలో వచ్చిన వరదల కారణంగా శ్రీశైలం డ్యామ్‌కు మరమ్మత్తులు నిర్వహించాల్సి ఉందని దీనికి 900 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని.... ప్రస్తుతం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న కారణంగా కేంద్రం సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్‌ కోరారు.

ఇదీచదవండి

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయాధికారం కేంద్రానిదే: షెకావత్‌

Last Updated : Oct 7, 2020, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.