ETV Bharat / city

Sputnik-V: స్పుత్నిక్-వీ దేశీయంగా తయారుచేస్తాం: డాక్టర్ రెడ్డీస్ - స్పుత్నిక్-వీ వ్యాక్సిన్​ వార్తలు

దేశీయంగా తయారుచేసిన స్పుత్నిక్-వీ(Sputnik-V ) వ్యాక్సిన్​ను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ చర్యలు వేగవంతం చేసింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయను డాక్టర్ రెడ్డీస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి కలిసి వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా తీరుతెన్నులపై చర్చించారు.

Sputnik-v latest news
స్పుత్నిక్-వీ దేశీయంగా తయారుచేస్తాం: డాక్టర్ రెడ్డీస్
author img

By

Published : Aug 5, 2021, 10:09 PM IST

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయను డాక్టర్ రెడ్డీస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి కలిశారు. వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా తీరుతెన్నులపై చర్చించారు. దేశీయంగా తయారుచేసిన స్పుత్నిక్-వీ(Sputnik-V ) వ్యాక్సిన్​ను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ చర్యలు వేగవంతం చేసింది. గతనెల మేలో స్పుత్నిక్ వ్యాక్సిన్​ను దేశంలో సాఫ్ట్ లాంఛ్ చేసిన డాక్టర్ రెడ్డీస్..ఇప్పటి వరకు వ్యాక్సిన్ డోసులను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్(RDIF) నుంచి దిగుమతి చేసుకుంటూ దేశంలో సరఫరా చేస్తూ వస్తోంది.

వచ్చే సెప్టెంబర్ నెల నుంచి దేశీయంగానే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్​ను ఉత్పత్తి చేసి సరఫరా చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని కేంద్రమంత్రికి కంపెనీ ఛైర్మన్ సతీష్ రెడ్డి గుర్తు చేశారు. ఉత్పత్తి, సరఫరాపై ప్రణాళికలను పంచుకున్నారు. దేశీయంగా స్పుత్నిక్(Sputnik-V ) వ్యాక్సిన్ తయారీకి డాక్టర్ రెడ్డీస్​తో పాటు.. ఆరు డ్రగ్ కంపెనీలతో ఈమేరకు ఆర్​డీఐఎఫ్​ ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాక్సిన్ డోసుల దిగుమతి, సొంత ఉత్పత్తి ద్వారా 250 మిలియన్ స్పుత్నిక్ -వీ డోసులను దేశంలో సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ప్రయత్నిస్తోంది.

ఆర్‌డీఐఎఫ్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ వినియోగానికి భారత్‌ ఇదివరకే అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ ప్రస్తుతం ప్రైవేటులోనే ఎక్కువగా అందుబాటులో ఉంది. అయితే, రెండో డోసు కొరత ఏర్పడిందని.. దీంతో తొలిడోసు తీసుకున్న వారికి ఆలస్యం అవుతోందనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆర్‌డీఐఎఫ్‌, అలాంటి నివేదికల్లో నిజం లేదని తెలిపింది. ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్‌, గ్లాండ్‌ ఫార్మా, హెటెరో బయోఫార్మా, పనేషియా బయోటెక్‌, స్టెలిస్‌ బయోఫార్మా, విర్కౌ బయోటెక్‌తో పాటు మోర్పెన్‌ ల్యాబ్‌లు స్పుత్నిక్‌ తయారీకి సన్నాహాలు చేస్తున్నాయని ఆర్‌డీఐఎఫ్‌ వెల్లడించింది. సెప్టెంబర్‌ నుంచి భారీ స్థాయిలో అందుబాటులో ఉంటాయని.. రానున్న రోజుల్లో స్పుత్నిక్‌ తయారీకి భారత్‌ కేంద్ర బిందువుగా మారనుందని అభిప్రాయపడింది.

ఇదీ చదవండి: polavaram: 'ఏపీ నుంచి వచ్చిన బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.