ETV Bharat / city

సుగంధిం.. పుష్టి వర్ధనం

కరోనా వ్యాప్తి తర్వాత సుగంధ ద్రవ్యాలకు గిరాకీ బాగా పెరుగుతోంది. వైరస్‌ నుంచి కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రజలు తమ రోగనిరోధకశక్తి పెంచుకునేందుకు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క తదితర సుగంధ ద్రవ్యాలతో కషాయాలు చేసుకుని తాగుతున్నారు. ఆయుష్‌ మంత్రిత్వశాఖ కూడా వీటినే సూచిస్తోంది. మరోవైపు వంటల్లోనూ వీటి వినియోగం పెరగడంతో ధరలూ క్రమంగా పెరుగుతున్నాయి.

spices Exports to overseas
సుగంధ ద్రవ్యాలు
author img

By

Published : Jul 23, 2020, 4:52 PM IST

కరోనా విజృంభణతో అందరూ ఇంట్లో ఉండే వస్తువులపైనే ఆధారపడుతున్నారు. సుగంధ ద్రవ్యాలను తమ ఆహారంలో వాడటం కాకుండా.. రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవడానికి వాడుతున్నారు. అందుకే వీటికి గిరాకీ పెరుగుతోంది. విదేశాల్లో సైతం వీటి వాడకం పెరగడంతో...ఎగుమతులు జోరుగా సాగుతున్నాయి.

కషాయంలో అల్లం..

ginger
అల్లం

కరోనా నేపథ్యంలో తేనీటిలోనూ అల్లం వాడకం పెరిగింది. కషాయాల్లోనూ మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు తదితర దినుసులతోపాటు కనీసం అంగుళంపాటి అల్లం ముక్కైనా వేయాలని చెబుతున్నారు. దీంతో వినియోగం, ధర కూడా రెట్టింపైంది. గతంలో కిలో అల్లం ధర రూ.80 ఉండేది. ఇప్పుడు రూ.160కి చేరింది. యాలకులు 100 గ్రాముల ధరే రూ.400 వరకు పలుకుతోంది.

  • అల్లం, ఇతర సుగంధ ద్రవ్యాలు కలిపిన టీ పొడికీ డిమాండు పెరిగింది. గతంలో కిలో రూ.400 ఉండే రకాలు ఇప్పుడు రూ.480కిపైగానే ధర పలుకుతున్నాయి.
  • రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు తులసి, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండుద్రాక్షకు రుచికి సరిపడా కాస్త బెల్లం, నిమ్మరసం కలిపి హెర్బల్‌ టీ తయారు చేసుకుని రోజుకు రెండుసార్లు తాగాలని ఆయుష్‌ మంత్రిత్వశాఖ సూచిస్తోంది. దీంతో వాటి వాడకమూ క్రమంగా పెరుగుతోంది.

ఇతర దేశాల్లోనూ..

Countries
దేశాలు

విదేశాల్లోనూ వీటి వాడకం అధికంగా ఉన్నట్లు అసోచామ్‌ (అసోసియేటెడ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019 జూన్‌లో రూ.2,030 కోట్ల విలువైన సుగంధ ద్రవ్య ఉత్పత్తుల్ని ఎగుమతి చేయగా 2020 జూన్‌లో రూ.2,721 కోట్లకు ఇవి పెరిగినట్లు తెలిపింది. అంటే గతేడాది జూన్‌తో పోలిస్తే ఎగుమతులు రూ.700 కోట్ల(34%) మేర పెరిగాయి. డాలర్ల పరంగా చూస్తే 23% పెరిగింది. ఇందులో అధికభాగం అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, ఇరాన్‌, సింగపూర్‌, చైనా, బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు వెళ్లాయి.

524% పెరిగిన యాలకుల ఎగుమతి

Cardamom
యాలకులు

ఎగుమతి అయిన వాటిలో యాలకులు, అల్లం, పసుపు, ధనియాలు, జాజికాయ, జీలకర్ర, సోంపు, మెంతుల వాటా అధికంగా ఉంది. 2019 జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌ నెలలో యాలకుల ఎగుమతి 524.7% పెరిగింది. అల్లం 146%, జీలకర్ర 121%, ధనియాలు 96%, జాజికాయ 62.91%, పసుపు 53.72% చొప్పున ఎగుమతులు పెరిగాయి. గత నెలలో రూ.228 కోట్ల విలువైన పసుపును ఎగుమతి చేశారు.

ఇదీ చూడండి. ఒక్కరినుంచి 57 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.