విజయవాడ విమానాశ్రయానికి స్పైస్ జెట్ విమాన సర్వీసులు పునః ప్రారంభం అయ్యయి. కొవిడ్ రెండో దశ నేపథ్యంలో విజయవాడకు స్పైస్ జెట్ సర్వీసులు నిలచిపోయాయి. మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఇవాళ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. మూడు నెలల సుదీర్ఘ విరామం అనంతరం విజయవాడ విమానాశ్రయానికి బెంగళూరు స్పైస్ జెట్ స్వదేశీ సర్వీస్ చేరుకుంది. ఎట్టకేలకు సర్వీసుల ప్రారంభంకావటంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
WATER DISPUTES: తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి...