కల్యాణోత్సవం అంటే గుర్తొచ్చేది.. భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణమే. దీనికోసం భక్తలు ఎదురు చూస్తుంటారు. సీతారామకల్యాణాన్ని చూస్తూనే వారు తరించిపోతారు. ఈయేడాది ఏప్రిల్ 21న జరగనున్న శ్రీరామనవమికి పంపే తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంటుంది.
కల్యాణానికి పంపేందుకు కోటి తలంబ్రాలను గోటితో వలుస్తారు. ఈ కార్యక్రమం విజయవాడ భక్తవత్సల సేవా సమితి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. రాజమండ్రిలో ప్రత్యేకంగా పండించిన ధాన్యాన్ని తలంబ్రాల కోసం సిద్ధం చేసేందుకు సేవాసమితికి పంపారు. సమితి సభ్యులు తలంబ్రాలను గోటితో రెండు నెలల ముందు నుంచే వలుస్తారు. అనంతరం ఈ తలంబ్రాలను భద్రాచలం పంపుతారు. సీతారామకల్యాణంలో తమ వంతు భాగస్వామ్యం ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని సమితి సభ్యలు చెపుతున్నారు.
ఇదీ చదవండి: రశీదులేని 1.7 కిలోల బంగారం పట్టివేత.. నిందితుల అరెస్ట్