ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ - అగర్తలా మధ్య దక్షిణ మధ్య రైల్వే 6 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈనెల 8,15,22 తేదీల్లో సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్ నుంచి ఎర్నాకుళంకు ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయి. ఈ నెల 12,19,26 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు అగర్తలా నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయి. గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మీదుగా రైళ్లు నడువనున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు రైల్వేశాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: TDP leaders : 'కుప్పం ప్రత్యేక అధికారి వైకాపా కార్యకర్తగా పనిచేస్తున్నారు'