ఉద్యోగుల హాజరు విధానంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు సంతకాలు పద్ధతి నుంచి క్రమేణా డిజిటల్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఈక్రమంలోనే బయోమెట్రిక్, ఐరిస్ విధానాలు అనేక చోట్ల అమలవుతున్నా.. లోటుపాట్లు లేకపోలేదు. కరోనా రెండో దశ ప్రభావంతో బయోమెట్రిక్ వేలిముద్ర ఆరోగ్య రీత్యా సురక్షితం కాదనే వాదనలూ ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ విభాగాలకు ముఖ గుర్తింపు సాఫ్ట్ వేర్ ద్వారా హాజరు తీసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ ముందు ప్రతి రోజు నుంచుని ఫొటో దిగితే విధులకు వచ్చిన సమయం, తిరిగి వెళ్లే సమయం అన్నీ డిజిటల్‌గా నమోదైపోతున్నాయి. ప్రభుత్వంలోని సీఎండీఏ రూపొందిన ఈ సాఫ్ట్‌వేర్‌ను నగరపాలక కార్పొరేషన్‌లోని వివిధ విభాగాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
ఉద్యోగి ఎదురుగా ఫోన్ పెడితే చాలు వారి ఐడీ నెంబర్ సహా విధులకు హాజరు కావాల్సిన సమయం, హాజరైన సమయం అన్నీ ఇట్టే డిస్‌ప్లే అవుతున్నాయి. కరోనా జాగ్రత్తల దృష్ట్యా ఈ విధానం తమకెంతో ఉపయోగపడుతోందని ఉద్యోగ సిబ్బంది చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా అమలవుతున్న ఈ విధానం అన్ని విభాగాల్లోనూ సత్ఫలితాలిస్తే ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ వినియోగించే అవకాశం లేకపోలేదు.
ఇదీ చదవండీ.. పూలే జయంతి నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ