వంటనూనెల బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని విజిలెన్స్ అదనపు డీజీ శంకబ్రత బాగ్చి తెలిపారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు అమ్మిన దుకాణాలపై 889 కేసులు పెట్టామని ఆయన వెల్లడించారు. బ్రాండ్ వంటనూనె పేరుతో మోసం చేసిన 8 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. రెవెన్యూ, మెట్రాలజీ, ఫుడ్ అండ్ సేఫ్టీ శాఖలతో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నామన్న విజిలెన్స్ అదనపు డీజీ.. ప్రజలు ఈ విషయంలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
"వంటనూనె ధరలు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగాయి. విజిలెన్స్ దాడులతో వంటనూనె ధరలు అదుపులోకి వస్తున్నాయి. రైతుబజార్లలో తక్కువ ధరకే వంటనూనెల విక్రయం. కొన్ని బ్రాండ్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. రెవెన్యూ, మెట్రాలజీ, ఫుడ్ అండ్ సేఫ్టీ శాఖలతో కలిసి తనిఖీలు. వంటనూనెలపై వాట్సప్ నంబర్ 94409 06254కు ఫిర్యాదు చేయాలి. వంటనూనెలు అక్రమంగా నిల్వ చేసేవారిపై కఠిన చర్యలు." - శంకబ్రత బాగ్చి, విజిలెన్స్ అదనపు డీజీ
ఇదీ చదవండి :