మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి టీఎస్ఆర్టీసీ 250 ప్రత్యేక బస్సులను నడుపుతుందని రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. ఈనెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్, దిల్సుఖ్ నగర్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈనెల 9వ తేదీన 25 బస్సులు, 10వ తేదీన 90 బస్సులు, 11వ తేదీన 75 బస్సులు, 12వ తేదీన 60 బస్సులను నడుపుతున్నామని పేర్కొన్నారు.
టికెట్ల ధరలు ఇలా..
ఎంజీబీఎస్ నుంచి సూపర్ లగ్జరీ బస్సులకు రూ.510, డీలక్స్ బస్సులకు రూ.450, ఎక్స్ప్రెస్ బస్సులకు రూ.400, నగరంలోని ఇతర ప్రదేశాల నుంచి సూపర్ లగ్జరీ బస్సులకు రూ.550, డీలక్స్ బస్సులకు రూ.480, ఎక్స్ ప్రెస్ బస్సులకు రూ.430 టికెట్ ధరగా నిర్ణయించామన్నారు.
ఇదీ చదవండి: గరుడ వాహనంపై ఊరేగిన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి