కోకో పంటలో శాస్త్రీయత, ఆధునిక యాజమాన్య పద్ధతుల ద్వారా రైతుల ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల కోకో ఉత్పత్తుల సదస్సును ఆయన విజయవాడలో ప్రారంభించారు. ఈ సదస్సులో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉద్యాన వన శాఖల అధికారులు , కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కోకో ఉత్పత్తుల నాణ్యత , కోకో ఆధారిత ఇతర ఉత్పత్తుల వినియోగం పెరగడం ద్వారా మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయని మంత్రి కన్నబాబు వెల్లడించారు.
కోకోతో పాటు ఆయిల్ పామ్ ఆధారిత ఉత్పత్తుల వృద్ధి, మార్కెటింగ్ కోసం కేంద్ర పథకాలు, రాష్ట్ర పథకాల అమలుపై ఈ సదస్సులో చర్చించారు. సాంకేతిక మార్కెటింగ్ అంశాలపై కేంద్రం మరింత సహకారం అందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌కు మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతులకు రెట్టింపు ఆదాయం పెంచేలా రాష్ట ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని అమలు చేస్తుందని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: సీఎం ఇంటి ముట్టడికి వచ్చిన వారిపై అత్యాచారం కేసు !