ETV Bharat / city

వాస్తవాలు బయటపెట్టిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వమే నిలిపివేసింది- సోము వీర్రాజు

SOMU: ఉచిత బియ్యం పంపిణీపై ఎంపీ జీవీఎల్​ వాస్తవాలు బయటపెట్టిన తర్వాత... రాష్ట్ర ప్రభుత్వమే నిలిపివేసిందని, ఈ విషయాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అంగీకరించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బియ్యం సరఫరా నిలిపివేసి కేంద్రాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూసిందని మండిపడ్డారు.

somu
somu
author img

By

Published : May 24, 2022, 9:19 AM IST

SOMU:ఉచిత బియ్యం పంపిణీపై ఎంపీ జీవీఎల్​ వాస్తవాలు బయటపెట్టిన తర్వాతే.. రాష్ట్ర ప్రభుత్వమే నిలిపివేసిందని, ఈ విషయాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అంగీకరించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. నిన్న మొన్నటి వరకూ కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇవ్వడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం, వైకాపా ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేశారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బియ్యం సరఫరా నిలిపివేసి కేంద్రాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూసిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం సరఫరాను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్‌ యోజన కింద బియ్యం పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ భాజపా ఎంపీ జీవీఎల్​ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, నిధులతో సేకరించిన ధాన్యం భారీ మొత్తంలో రాష్ట్రప్రభుత్వం వద్ద నిల్వ ఉన్నా బియ్యం లేవంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గడప గడపకూ వెళ్లి... వైకాపా ఎమ్మెల్యేలు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారంటూ దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.