SOMU VEERRAJU: కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ యోజన పథకం ద్వారా పేదలకు అందించే ఉచిత బియ్యాన్ని.. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలుగా ఇవ్వడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వచ్చినప్పటి నుంచి కేంద్రం సబ్సిడీ బియ్యాన్ని ఉచితంగా అందిస్తుందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పేద ప్రజలకు ఆకలి బాధలు తప్పడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్రం నీరుగారుస్తోందని విమర్శించారు. నీతి అయోగ్ 86 లక్షల మంది లబ్దిదారులను గుర్తిస్తే.. రాష్ట్రం మాత్రం కోటి 47 లక్షల మందికి పంపిణీ చేస్తుందని... మిగతా వారు వైకాపా కార్యకర్తలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి పేదలకు బియ్యం ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్ధృతం చేస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు.
-
పేదలకు అందాల్సిన ఉచిత రేషన్ పంపిణీ నిలిపివేసి నిస్సిగ్గుగా నిరుపేదలను మోసం చేస్తున్న దళారులు, మిలర్లకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి.రేషన్ బియ్యంతో మాత్రమే కడుపునింపుకునే కొన్ని లక్షల కుటుంబాల ఆకలి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?@ysjagan
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) July 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
గారు! @blsanthosh pic.twitter.com/X6KRqF3Zpv
">పేదలకు అందాల్సిన ఉచిత రేషన్ పంపిణీ నిలిపివేసి నిస్సిగ్గుగా నిరుపేదలను మోసం చేస్తున్న దళారులు, మిలర్లకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి.రేషన్ బియ్యంతో మాత్రమే కడుపునింపుకునే కొన్ని లక్షల కుటుంబాల ఆకలి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?@ysjagan
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) July 14, 2022
గారు! @blsanthosh pic.twitter.com/X6KRqF3Zpvపేదలకు అందాల్సిన ఉచిత రేషన్ పంపిణీ నిలిపివేసి నిస్సిగ్గుగా నిరుపేదలను మోసం చేస్తున్న దళారులు, మిలర్లకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి.రేషన్ బియ్యంతో మాత్రమే కడుపునింపుకునే కొన్ని లక్షల కుటుంబాల ఆకలి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?@ysjagan
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) July 14, 2022
గారు! @blsanthosh pic.twitter.com/X6KRqF3Zpv
ఇవీ చదవండి: