ETV Bharat / city

'సోనూసూద్ చూపిస్తున్నంత చొరవ కూడా రాష్ట్ర ప్రభుత్వం చూపించటం లేదు' - సోమిరెడ్డి తాజా వార్తలు

కష్టకాలంలో పేదలకు అండగా నిలిచే సీఎం రిలీఫ్ ఫండ్​ను వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని తెదేపా నేత సోమిరెడ్డి ఆరోపించారు. పశ్చిమ గోదాదవరి జిల్లాలో 8 నెలల చిన్నారి వైద్యానికి రూ. 6 లక్షలు సాయం చేసిన సోనూసూద్​ను అభినందించిన ఆయన..ఎక్కడో ముంబయిలో ఉండే సోనూ సూద్ స్పందించే దాకా ఏపీ ప్రభుత్వం ఏంచేస్తోందని నిలదీశారు.

సోమిరెడ్డి ట్వీట్
సోమిరెడ్డి ట్వీట్
author img

By

Published : Jan 24, 2021, 10:09 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందిన 8 నెలల చిన్నారికి గుండెలో సమస్య రాగా, సినీ నటుడు సోనూ సూద్ శస్త్రచికిత్స కోసం రూ.6 లక్షల సాయం చేశారు. దీనిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీటర్​ వేదికగా స్పందించారు.

ఎక్కడో ముంబయిలో ఉండే సోనూసూద్ ఈ విషయంపై స్పందించే దాకా ఏపీ ప్రభుత్వం ఏంచేస్తోందని నిలదీశారు. సోనూ చూపినంత చొరవను కూడా ఏపీ ప్రభుత్వం చూపలేకపోవటం దురదృష్టకరమన్నారు. పేదలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పసిబిడ్డ గుండె సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకుని శస్త్రచికిత్సకు రూ.6 లక్షలిచ్చి సాయం చేయటం అభినందనీయమన్నారు.

సోమిరెడ్డి ట్వీట్
సోమిరెడ్డి ట్వీట్

కష్టకాలంలో పేదలకు అండగా నిలిచే సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) ను పూర్తిగా నిర్వీర్యం చేశారని సోమిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు అతీతంగా కష్టాల్లో ఉన్నామని ఎవరు ముందుకొచ్చినా ప్రతి ఒక్కరికీ వైద్య ఖర్చుల కోసం సాయం చేశామని వెల్లడించారు. జగన్ వచ్చాక సీఎంఆర్ఎఫ్ సాయం నిలిపివేశారని, ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు.

ఇదీచదవండి: బహుమతి పేరిట భారీ మోసం.. రూ.2.90 లక్షలకు కుచ్చుటోపి !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.