Telangana CM KCR Hospitalised: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైద్య పరీక్షాలు ముగిశాయి. ఈ ఉదయం ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి, కుమార్తె, మనుమడు, ఎంపీ సంతోష్ ఉన్నారు. వైద్యులు కేసీఆర్‌కు పలు పరీక్షలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్ సైతం.. సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లారు.
కేసీఆర్‌కు గుండె, యాంజియో, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించినట్లు సీఎంవో వెల్లడించింది. అస్వస్థత కారణంగా నేటి యాదాద్రి పర్యటనను సీఎం రద్దు చేసుకున్నారు. ఇటీవల దిల్లీలో కూడా కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. యశోద ఆస్పత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.
కేసీఆర్ ఆరోగ్యంగానే..
సీఎం వైద్య పరీక్షలపై వ్యక్తిగత వైద్యుడు డా.ఎం.వి.రావు వివరణ ఇచ్చారు. సీఎంకు ఏటా ఫిబ్రవరిలో సాధారణ చెకప్ చేస్తామని డా.ఎం.వి.రావు పేర్కొన్నారు. రెండ్రోజులుగా బలహీనంగా ఉన్నట్లు సీఎం చెప్పారన్నారు. కేసీఆర్‌కు సాధారణ పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. ఎడమ చేయి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారని తెలిపారు. ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేసినట్లు తెలిపారు. సీఎంకు సీటీస్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ చేసినట్లు చెప్పారు. సాధారణ పరీక్షల్లో భాగంగానే పరీక్షలు చేస్తున్నామన్నారు. పరీక్షల రిపోర్టుల ఆధారంగా ఏం చేయాలో చూస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు.
"సీఎంకు ఏటా ఫిబ్రవరిలో సాధారణ చెకప్ చేస్తాం. రెండ్రోజులుగా బలహీనంగా ఉన్నట్లు కేసీఆర్ చెప్పారు. కేసీఆర్‌కు సాధారణ పరీక్షలు నిర్వహించాం. ఎడమ చేయి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేశాం. సీటీస్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ చేశాం. పరీక్షల రిపోర్టుల ఆధారంగా ఏం చేయాలో చూస్తాం. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. కేసీఆర్‌కు ప్రివెంటివ్ చెకప్ మాత్రమే చేస్తున్నాం"
- డా.ఎం.వి.రావు
ఇదీ చదవండి:
Ravi Prakash Case: రవిప్రకాష్‌పై హైకోర్టు, నాంపల్లి కోర్టులో వేర్వేరు పిటిషన్లు