ETV Bharat / city

వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభం - సిరిమానోత్సవం తాజా వార్తలు

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా ప్రారంభమైంది. పైడితల్లి.. అమ్మవారి పూజారి బంటుపల్లి వెంకట్రావు రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సిరిమానోత్సవం సందర్భంగా ప్రముఖులు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైభవంగా ప్రారంభమైన సిరిమానోత్సవం
వైభవంగా ప్రారంభమైన సిరిమానోత్సవం
author img

By

Published : Oct 27, 2020, 4:57 PM IST

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరుగుతోంది. పైడితల్లి అమ్మవారు పూజారి బంటుపల్లి వెంకట్రావు రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. పాలధార, జాలరి వల, నల్లఏనుగు, అంజలి రథం వెంట సిరిమాను బయల్దేరింది.

ఆలయం నుంచి కోట వరకు 3 సార్లు సిరిమాను రూపంలో ప్రదక్షిణలు నిర్వహించనుండగా.. పూజారి బంటుపల్లి వెంకట్రావు నాలుగోసారి సిరిమానును అధిరోహించారు. మంత్రి బొత్స కుటుంబ సభ్యులతో కలిసి డీసీసీబీ బ్యాంకు నుంచి ఉత్సవాలను తిలకించారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచైత గజపతి కోట నుంచి వేడుక తిలకిస్తున్నారు.

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

అంతకుముందు పలువురు ప్రముఖులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఆలయ అనువంశిక ధర్మకర్త సంచైత గజపతిరాజు, మాజీ ఛైర్మన్ దివంగత ఆనంద గజపతిరాజు కుటుంబ సభ్యులు, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, సభాపతి తమ్మినేని సీతారాం, ఎంపీ బెల్లన చంద్రశేఖర్, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స... ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. కుటుంబ సమేతంగా పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న సభాపతి తమ్మినేని దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కొవిడ్ ప్రభావం త్వరగా తగ్గాలని, సాధారణ పరిస్థితులు రావాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు తమ్మినేని తెలిపారు.

ఇదీ చదవండి:

నవంబరులో తిరుమల జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.