పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రజలు 0866 2466877 నెంబర్కు ఫోన్ చేయవచ్చని.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. తమ సమస్యలు సహా రాజకీయ పార్టీల అక్రమాలపై ఫిర్యాదు చేయవచ్చని ఎస్ఈసీ వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును కాల్ సెంటర్ సిబ్బంది నమోదు చేయాలని ఆదేశించారు.
ఫిర్యాదు తీవ్రతను బట్టి వెంటనే సంబంధిత అధికారికి పంపి పరిష్కరించాలని... జిల్లా కలెక్టర్లకు, పోలీస్ సూపరింటెండెంట్లకు, ఎన్నికల పరిశీలకులకు ఆ ఫిర్యాదులు పంపాలని ఆదేశించారు. కాల్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఈ కేంద్రాన్ని నిరంతరం పర్యవేక్షించనున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
విశాఖలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు దక్షిణ కొరియా సంస్థ ఆసక్తి: కేంద్రం