నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి, కర్నూలు జిల్లాలోని అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకం కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీని ఉన్నత విద్యాశాఖ నియమించింది. ఏపీ ప్రభుత్వం తరపున నామినీగా ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ బీల సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నామినీగా నాగార్జున విశ్వవిద్యాలయ మాజీ వీసీ హరగోపాల్ రెడ్డి, యూజీసీ నామినీగా హరియాణాలోని సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ఆర్సీ కుహద్లను నియమించారు.
కర్నూలులోని ఉర్దూ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎంపికలో సెర్చ్ కమిటీ సభ్యులుగా ఏపీ ప్రభుత్వ నామినీగా ఎస్వీ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ కొలకలూరి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి ఉస్మానియా మాజీ వీసీ మహ్మద్ సులేమాన్ సిద్దీఖి, యూజీసీ నామినీగా అలిగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తారీఖ్ మన్సూర్లను నియమించారు.
రెండు విశ్వవిద్యాలయాలకూ వేర్వేరుగా ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను సమర్పించాల్సిందిగా సెర్చ్ కమిటీలను ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చదవండి
KRMB: రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించనున్న కృష్ణా బోర్డు ప్రతినిధులు