యాదగిరివాసునికి సరికొత్త రూపాలంకరణలతో వినూత్న ఆలయం సిద్ధమైంది. ఆలయమంటే ఓ గోపురం, ఓ ధ్వజస్తంభం, ఓ గంట కట్టేసినంత సులువుగా చేసినది కాదు ఈ యాదాద్రి. దాదాపు 1500 మంది శిల్పులను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని ఆళ్లగడ్డ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలనుంచి సుత్తి, ఉలి, శానం చేతపట్టుకుని విచ్చేశారు. 30మందికి పైగా స్తపతులు, ప్రధాన స్తపతి ఈ వందలాది శిల్పకారులచేత అహరహం శిలలపై శిల్పాలు చెక్కించారు.
శిల్పశాస్త్రంలో దేవతాశిల్పాలకు ఓ జాతిరాయిని, ఇతర విగ్రహాలను చెక్కేందుకు మరో జాతి శిల్పాలను ఎంచుకోవాలని ఉంది. యాదాద్రి ఆలయ దేవతామూర్తుల రూపకల్పనకు కృష్ణశిలను ఎంచుకోవడంలో ఆధ్యాత్మిక కోణం అద్భుతంగా ఇమిడిఉంది. ఆ శిల్పాలు ఎక్కడ ఎలా ఉంటే వాస్తుయుక్తమో, చూడచక్కదనమో చెప్పే ఆర్కిటెక్చర్ తన వందలాది డ్రాయింగ్‌ల రోల్స్‌తో నర్సింహాద్రి గుట్టనెక్కారు. అద్భుత శిల్పసంపదను నర్సింహాద్రి గుట్టపై నెలకొల్పారు.
ఇదీ చదవండి: తిరుమలలో కన్నులపండువగా శ్రీవారి తెప్పోత్సవం