రాష్ట్రంలో లాక్డౌన్ అమలు అవుతున్న పరిస్థితుల్లో ప్రజలకు నిత్యావసరాలు రైతు బజార్లలో అందుబాటులో ఉంచారు. విజయవాడలో ఏర్పాటు చేసిన రైతు బజార్లను మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే విష్ణు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు బజార్లలో కూరగాయల విక్రయాలు, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎండ విపరీతంగా ఉన్న నేపథ్యంలో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలింకగా టెంట్లు వేసేలా కలెక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలెవరూ నిత్యావసరాల కోసం ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. రేషన్ బియ్యం, కందిపప్పు వాలంటీర్ల ద్వారా ఇంటికే పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎతం చేస్తున్నా సామాన్య ప్రజల నుంచి సహకారం లేకపోతే....కరోనా కట్టడి సాధ్యం కాదన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాలు పాటించి ఇంటికే పరిమితం కావాలని కోరారు.
ఇదీ చూడండి: