తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలోని జేపీ నగర్లో ఓ మహిళపై కొంతమంది మహిళల దాడి చేసిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. జేపీ నగర్‌కు చెందిన హనుమంతు, లక్ష్మీ.. తన స్థలంలో ఇంటి నిర్మాణ పనుల ప్రారంభం కోసం మూడు రోజుల కిందట ప్రయత్నం చేశారు. ఆ స్థలం ఆమెది కాదని కొందరు వారించి అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్లో లక్ష్మీ ఫిర్యాదు చేసింది.
శుక్రవారం ఇంటి నిర్మాణ పనుల కోసం మహిళ అక్కడికి వెళ్లగా.. తమపైనే కేసు పెడతావా అంటూ కొందరు మహిళలు లక్ష్మీపై దాడికి దిగారు. పోలీసులు వారించినా వినకుండా దాడి చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించినా వినకుండా చేతికి దొరికిన దానితో కొట్టారు. దీంతో దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదీ చూడండి:
Raghurama letter to Jagan: సీఎంకు రఘురామ మరోలేఖ.. ఈ సారి 'పెళ్లికానుక'పై..!