Ministers Bus Tour: ముఖ్యమంత్రి జగన్ కేబినెట్‌లోని మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రకు సిద్ధమవుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు బస్సు యాత్ర చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో ఈ యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్రలో 17 మంది మంత్రులు పాల్గొననున్నారు. అందుకోసం రెండు బస్సులను సిద్ధం చేశారు. యాత్ర విశాఖపట్నం నుంచి ప్రారంభమై.. అనంతపురంలో ముగియనుంది. ముఖ్యమైన పట్టణాలు , నియోజకవర్గాలు, మండలకేంద్రాల మీదుగా బస్సు యాత్ర సాగనుంది. ఈ మేరకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. శ్రీకాకుళం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి మంత్రులు ప్రసంగించనున్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను యాత్రలో మంత్రులు ప్రజలకు వివరించనున్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు,రాజ్యసభ స్థానాల్లో వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ఇస్తోన్న ప్రాధాన్యతలను వివరించనున్నారు. ప్రస్తుతం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 'గడప గడపకూ' ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు నిర్వహిస్తుండగా.. మంత్రులు బస్సు యాత్రలో పాల్గొననున్నారు.
ఇవీ చూడండి