కరోనా మెుదటి, రెండో వేవ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు తమకంటూ సొంతిల్లు ఉండాలని కోరుకుంటున్నట్లు... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ కే రంగ రాజన్ తెలిపారు. ప్రతి ఒక్కరి సొంతింటి కళను నెరవేర్చుకునేందుకు.... విజయవాడలో నిర్వహిస్తున్న క్రెడాయ్ ప్రాపర్టీ షో ఎంతగానో దోహదం చేస్తోందని అభిప్రాయపడ్డారు. అతితక్కువ వడ్డీ రేటుతో ఎస్బీఐ ద్వారా గృహ రుణాలు అందిస్తున్నామని తెలిపారు.
ఎస్బీఐ అంటేనే నమ్మకైన బ్రాండ్ అని రంగ రాజన్ పేర్కొన్నారు. తాము ఒక ప్రాపర్టీని ఎంపిక చేశామంటే, ప్రజలకు ఎంతో నమ్మకమైన భరోసా కల్పిస్తామని స్పష్టం చేశారు. బిల్డర్ సమన్వయంతో చేసుకుంటే లాయర్ ఫీజులు లాంటివి ఉండవని తెలిపారు. విజయవాడ నగరంలో సహా చుట్టుపక్కల పోరంకి, గొల్లపూడి ప్రాంతాల్లో హౌసింగ్ ప్రాజెక్టులు ముందుకు వస్తున్నారని వెల్లడించారు.
ఇదీ చదవండి: jagananna colonies : లేఅవుట్లు వేసి వసతులు మరిచారు.. పట్టాలిచ్చి పైసలు మరిచారు