విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్దానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై మూడు రోజుల సంక్రాంతి పండుగ సంబరాలు సంప్రదాయబద్దంగా ప్రారంభమయ్యాయి. గంగిరెద్దులు, హరిదాసులు, మేళతాళాల నడుమ రంగవల్లులపై గొబ్బెమ్మలు ఉంచి భోగి మంటలు వేశారు. స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాదశర్మ, వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు దంపతులు మంత్రోచ్చరణల మధ్య భోగి మంటను ప్రజ్వలింపజేశారు.
భోగి మంటల చుట్టూ ప్రదక్షిణలు చేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. మహామండపం పెద్ద రాజ గోపురం ఎదురుగా బొమ్మలకొలువు ఏర్పాటు చేశారు. భోగి సందర్భంగా అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులు వేడుకల్లో భాగస్వాములయ్యారు. సాయంత్రం పెదరాజ గోపురం ఎదురుగా ఉన్న బొమ్మలకొలువు వద్ద ఏర్పాటు చేసిన ఉత్సవ మూర్తుల వద్ద చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తామని ఈవో సురేష్‌బాబు తెలిపారు.
ఇదీ చదవండి: