ETV Bharat / city

సంగం డెయిరీ.. పాల ఉత్పత్తిదారుల ఆస్తి: ధూళిపాళ్ల నరేంద్ర

విజయవాడలో ధూళిపాళ్ల నరేంద్ర నేతృత్వంలో సంగం డెయిరీ పాలకవర్గ సమావేశం జరిగింది. ప్రభుత్వ పరంగా ఎదురయ్యే అడ్డంకులను అధిగమించాలని ఈ సమావేశంలో తీర్మానం రూపొందించారు. సంగం డెయిరీ పాల ఉత్పత్తిదారుల ఆస్తి అన్న ధూళిపాళ్ల... 50 శాతం రాయితీతో పాలుపితికే యంత్రాలు, బ్రష్‌ కట్టర్లు అందిస్తామన్నారు.

Sangam Dairy governing body unanimous decision in vijayawada
సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర
author img

By

Published : May 29, 2021, 8:56 PM IST

ప్రభుత్వ పరంగా ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించి ముందుకు సాగాలని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఈ మేరకు పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. సంగం డెయిరీ పాల ఉత్పత్తిదారుల ఆస్తి అని, పాలకవర్గం విధాన నిర్ణేత మాత్రమేనని ధూళిపాళ్ల నరేంద్ర స్పష్టం చేశారు. విజయవాడలోని నరేంద్ర నివాసంలో సంగం డెయిరీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. జూన్ ఒకటి నుంచి కిలో వెన్నకు రూ.715 చెల్లించాలని నిర్ణయించినట్లు ధూళిపాళ్ల వెల్లడించారు. పశుదాణా కోసం రైతుల నుంచి సేకరించే మొక్కజొన్నల ధర క్వింటాలుకు రూ.1,700 చెల్లించటంతో పాటు ఈ ఏడాదిలో రెండువేల టన్నుల మొక్కజొన్న కోనుగోలు చేయాలని పాలకవర్గ సమావేశంలో నిర్ణయించామన్నారు.

కుప్పంలో పాలశీతలీకరణ కేంద్రం...

ఆవుల్లో పొదుగువాపు నివారణ పథకాన్ని చిత్తూరు జిల్లాలో ప్రారంభిస్తున్నామని, 14మంది పశువైద్యులు 2 బృందాలుగా పనిచేస్తారని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. నలభై మంది పశువైద్యులతో 20 సంచార పశువైద్య మార్గాలు, పన్నెండు అత్యవసర పశువైద్య మార్గాలలో పనిచేసేందుకు రూ.14కోట్లు ఖర్చు చేశామన్నారు. త్వరలోనే కుప్పంలో పాలశీతలీకణ కేంద్రం ఏర్పాటు చేయటంతో పాటు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఐదువేల లీటర్ల సామర్ధ్యం గల బల్క్ కూలర్ ను ప్రారంభిస్తామని నరేంద్ర వెల్లడించారు.

సబ్సిడీతో పాడి పరికరాలు...

పాడి యాంత్రీకరణలో భాగంగా పాలుపితికే యంత్రాలు, బ్రష్ కట్టర్ లను యాభై శాతం సబ్సిడీతో అందించనున్నట్లు ధూళిపాళ్ల నరేంద్ర వివరించారు. రైతు సాధికారత కోసం ఏర్పడిన ఈ డెయిరీ పాడి రైతుల సంక్షేమం కోసం పాటుపడుతోందని నరేంద్ర స్పష్టం చేశారు. మరోవైపు ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై పాలకవర్గం తీసుకునే అన్ని నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని సభ్యులు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

కర్ఫ్యూ, 144 సెక్షన్​తో కరోనా కేసుల తగ్గుదల: సింఘాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.