ETV Bharat / city

ఖాళీ రెమ్‌డెసివిర్‌ సీసాల్లో.. సెలైన్‌ నీళ్లు ! - ఖాళీ రెమ్‌డెసివిర్‌ సీసాల్లో సెలైన్‌ నీళ్లు వార్తలు

కరోనా రోగుల రెమ్‌డెసివిర్‌ అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ఓ మత్తుమందు టెక్నీషియన్‌... ఘరానా మోసానికి తెరలేపాడు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల ఖాళీ సీసాలను సేకరించి, వాటిలో సెలైన్‌ వాటర్‌ నింపి అసలైన ఇంజక్షన్లుగా మార్చి మెడికల్ దుకాణాల నిర్వహకులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాడు.

ఖాళీ రెమ్‌డెసివిర్‌ సీసాల్లో సెలైన్‌ నీళ్లు

author img

By

Published : May 23, 2021, 11:13 AM IST

రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల ఖాళీ సీసాలను సేకరించి, వాటిలో సెలైన్‌ వాటర్‌ నింపి అసలైన ఇంజక్షన్లుగా మార్చేస్తున్నాడో మత్తుమందు టెక్నీషియన్‌. వాటిని రెండు మెడికల్‌ దుకాణాల నిర్వాహకులకు అంటగట్టి, ఒక్కో ఇంజక్షన్‌ను రూ.20వేలకు విక్రయించాడు. టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ కె.వి.శ్రీనివాసరావు తెలిపిన ప్రకారం... విజయవాడ దుర్గాపురం వాసి చోడవరపు కిషోర్‌ (39) సూర్యారావుపేటలోని ఒక ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రిలో మత్తుమందు టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.

అక్కడ రోగులకు వినియోగించిన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల ఖాళీ సీసాలను భద్రపరిచి, వాటిలో సెలైన్‌ వాటర్‌ నింపేవాడు. వాటినే అసలైన ఇంజక్షన్లుగా నమ్మించి డోర్నకల్‌ రోడ్డులోని కోన మెడికల్స్‌ నిర్వాహకుడు కటికపూడి సంపత్‌కుమార్‌, గోవిందరాజులు నాయుడు వీధిలోని జయశ్రీ మెడికల్స్‌ నిర్వాహకుడు పాలడుగుల వెంకట గిరీష్‌లకు విక్రయించాడు.

గుంటూరుకు చెందిన ఓ కరోనా బాధితుడి బంధువులు వీరిని సంప్రదించగా..ఇంజక్షన్లను ఒక్కోటి రూ.20 వేల చొప్పున విక్రయించారు.గుంటూరు ఆసుపత్రి వైద్యులు వాటిని నకిలీగా గుర్తించారు. బాధితులు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆరు నకిలీ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

'ఆనందయ్యది ఆయుర్వేదం కాదు..నాటు మందు'

For All Latest Updates

TAGGED:

Remdesivir
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.