ETV Bharat / city

బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారు: సజ్జల - సజ్జల న్యూస్

బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ కేబినెట్​లో 68 శాతం వెనుకబడిన వర్గాలవారే ఉన్నారని తెలిపారు. తమ పార్టీ ఎప్పుడూ రాజకీయ సాధికారత దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు.

బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారు
బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారు
author img

By

Published : Apr 10, 2022, 9:13 PM IST

వైకాపా ఎప్పుడూ రాజకీయ సాధికారత దిశగా అడుగులు వేస్తూనే ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారని చెప్పారు. కొత్త కేబినెట్‌ కూర్పులో సామాజిక సమీకరణలపై వివరించారు. తమ కేబినెట్‌లో దాదాపు 68 శాతం మంది బీసీలు ఉన్నారని వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు 17 మంది మంత్రి పదవులు ఇచ్చామని తెలిపారు. ట్రస్టులు, నామినేటెడ్‌, ఇతర సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశామని తెలిపారు. తమ ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. కేబినెట్‌లో నలుగురు మహిళలకు చోటు కల్పించామని సజ్జల వెల్లడించారు.

"మా మంత్రివర్గ జాబితాను చంద్రబాబు పరిశీలించాలి. తెదేపా ప్రభుత్వంలో 25 మంది మంత్రుల్లో 55 శాతం ఓసీలు ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు ఎస్టీలు, మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు. మా కేబినెట్‌లో 68 శాతం వెనుకబడిన వర్గాలే ఉన్నారు. మా పరిపాలన చూసి బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారు." - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు

25 మందితో కొత్త కేబినెట్: రాష్ట్ర కొత్త కేబినెట్ ఖరారైంది. ఎన్నో కసరత్తులు.. మరెన్నో సమీకరణాలు.. ఇంకెన్నో కూడికలు, ఎన్నెన్నో తీసివేతల తర్వాత నూతన మంత్రివర్గం కూర్పు ఫైనల్ అయ్యింది. మొత్తం 25 మందిని కేబినెట్లోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. నూతన మంత్రివర్గం రేపు (సోమవారం) ఉదయం కొలువుదీరనుంది. గడిచిన మూడురోజులుగా మంత్రివర్గం కూర్పుపై ఎన్నో మంతనాలు సాగించిన సీఎం.. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రానికి తుదిజాబితాను ఖరారు చేశారు. రేపు ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న పార్కింగ్‌ స్థలంలో.. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా.. మంత్రుల పేర్లను ఖరారు చేసి.. ఈ జాబితాను రాజ్​భవన్​కు పంపించారు. గవర్నర్ ఆమోదించారు.

కొత్త మంత్రివర్గం జాబితా ఇదే :

పేరుజిల్లాసామాజికవర్గం
ధర్మన ప్రసాద రావుశ్రీకాకుళంవెలమ
సీదిరి అప్పలరాజుశ్రీకాకుళంమత్స్యకార
బొత్స సత్యనారాయణవిజయనగరంతూర్పు కాపు
రాజన్న దొరపార్వతీపురంఎస్టీ
గుడివాడ అమర్‌నాధ్‌అనకాపల్లికాపు
ముత్యాలనాయుడుఅనకాపల్లికొప్పుల వెలమ
దాడిశెట్టి రాజాకాకినాడకాపు
పినిపె విశ్వరూప్‌కోనసీమఎస్టీ
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకోనసీమబీసి - శెట్టి బలిజ
తానేటి వనితతూర్పుగోదావరిమాదిగ - ఎస్సీ
కారుమూరి నాగేశ్వరరావుపశ్చిమ గోదావరియాదవ - బీసీ
కొట్టు సత్యనారాయణపశ్చిమ గోదావరికాపు
జోగి రమేష్కృష్ణాగౌడ - బీసీ
అంబటి రాంబాబుపల్నాడుకాపు
మేరుగ నాగార్జునబాపట్లఎస్సీ
విడదల రజనిగుంటూరుబీసీ
కాకాణి గోవర్దన్​ రెడ్డినెల్లూరుఓసీ - రెడ్డి
అంజద్‌ బాషాకడపమైనార్టీ
బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డినంద్యాలఓసీ - రెడ్డి
గుమ్మనూరు జయరాంకర్నూలుఓసీ - బోయ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిచిత్తూరుఓసీ - రెడ్డి
నారాయణ స్వామిచిత్తూరుఎస్సీ
ఆర్‌ కే రోజాచిత్తూరుఓసీ - రెడ్డి
ఉషా శ్రీ చరణ్‌అనంతపురంకురుమ- బీసీ
ఆదిమూలపు సురేశ్‌ప్రకాశంఎస్సీ

ఇదీ చదవండి: 25 మందితో కొత్త కేబినెట్.. జగన్ టీమ్ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.