కరోనా వైరస్, దళితులపై దాడులు, రాజధాని సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు సీఎం జగన్, మంత్రులు.. కోర్టులు, కేసుల పేరుతో ఎదురుదాడి చేస్తున్నారని శైలజానాథ్ మండిపడ్డారు. ఆలయాలపై దాడులు, ధ్వంసాలు జరుగుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఎదురుదాడి చేస్తున్నారన్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఓటింగ్లో భాజాపాకు మద్దతు పలికిన జగన్.. ఏపీలో తెదేపా, భాజపా, జనసేన సంయుక్తంగా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. ప్రజల ముందు తాము వేరు అని ప్రకటనలు ఇస్తూ రెండు పార్టీలు కలిసే నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని కేసులు పెట్టి వేధిస్తున్నారని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: దుర్గమ్మ వెండి రథంలోని మూడు సింహాలు ఎవరు తీసుకెళ్లినట్టు?