ETV Bharat / city

ఆ సంస్థకు గౌరవ గ్లోబల్‌ ప్రెసిడెంట్​గా సాధినేని యామిని

ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అప్లైడ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి గౌరవ అంతర్జాతీయ ప్రెసిడెంట్‌గా ఎంపికైనట్లు భాజపా నాయకురాలైన సాధినేని యామిని తెలిపారు. తనను గౌరవ గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ గా ఎంపిక చేసినందుకు గ్లోబల్‌ ప్యానెల్‌ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు.

news on sadineni yamini
గౌరవ గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ గా సాధినేని యామిని
author img

By

Published : May 4, 2020, 10:58 AM IST

భారతీయ జనతా పార్టీ నాయకురాలైన సాధినేని యామినిని ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అప్లైడ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి గౌరవ అంతర్జాతీయ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేసినట్లు ఆమె తెలియజేశారు. మేకిన్‌ ఇండియా నినాదాన్ని నిజం చేయాలని దేశ ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులు తీసుకురావడం అలానే దేశీయ పెట్టుబడుదారులను ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పారు. ఇక్కడ ఉన్న వనరులతోపాటు ఆర్ధిక సరళీకృత విధానాల ద్వారా ప్రపంచ పెట్టుబడిదారుల సంస్థలకు సందేశాలు పంపిస్తామని చెప్పారు. తద్వారా మన దేశంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా కౌన్సిల్‌ ద్వారా కృషి చేస్తానని యామిని తెలియజేశారు. తనను గౌరవ గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ గా ఎంపిక చేసినందుకు గ్లోబల్‌ ప్యానెల్‌ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో లాక్​డౌన్​ అమలుకు కొత్త మార్గదర్శకాలివే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.