వర్షకాల ప్రభావం రైతు బజార్లపై అధికంగా ఉంటుంది. కూరగాయల దిగుబడులు అధికంగా ఉన్న సరఫరా వ్యత్యాసంతో...ధరలు చుక్కలనంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు అధికంగా ఉన్నాయి. రైతు బజార్లలో కిలో 50 రూపాయలు ఉంటే... బహిరంగ మార్కెట్ లో 60 రూపాయలు పలుకుతుంది. రైతు బజార్ మిగతా కూరగాయల ధరల విషయంలో వినియోగదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రైతు బజార్లకు బయట దుకాణాలు పెరిగిపోవడంతో రద్దీ ఎక్కువ అవుతుంది. కరోనా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో రైతుబజార్లకు రావడం ఇబ్బందికరంగా ఉందని వినియోగదారులు చెబుతున్నారు. రైతు బజార్లలో వినియోగదారులు భౌతిక దూరం పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతుంది. రైతు బజార్లలో కూరగాయల ధరలు తెలిపే బోర్డులు లేకపోవడంతో వ్యాపారుల ఇష్టానుసరం ధరలు ఉంటున్నాయని వినియోగదారులు అంటున్నారు.
విజయవాడ పటమట రైతు బజారు.. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చిత్తడిగా మారింది. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితులపై రైతు బజారు ఎస్టేట్ అధికారిని ప్రశ్నించగా... ఈ సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆదివారంనాడు రైతు బజారు రద్దీగా ఉంటుందని, భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని మైక్ లో చెప్తున్నట్లు రైతు బజారు అధికారి కరుణాకర్ చెప్పారు. రైతు బజార్ల వికేంద్రీకరణ వల్ల పటమట ప్రాంతంలో గల 5 మార్కెట్ లలో సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
ఇదీ చదవండి : కరోనా సోకినా... లక్షణాల్లేకుంటే 17 రోజులయ్యాక పనుల్లోకి