ETV Bharat / city

రూసా నిధులు 180 కోట్ల మళ్లింపు..పెండింగ్‌లో రూ.46 కోట్ల బిల్లులు - రూసా నిధులు మళ్లింపు న్యూస్

ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్ష అభియాన్‌ (రూసా) కింద ఇచ్చిన రూ.180 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించింది. దీంతో నిధులు లేక రూసా పనులు ముందుకు సాగడం లేదు.

రూసా నిధులు 180 కోట్ల మళ్లింపు
రూసా నిధులు 180 కోట్ల మళ్లింపు
author img

By

Published : Jul 14, 2022, 4:15 AM IST

ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్ష అభియాన్‌ (రూసా) కింద ఇచ్చిన రూ.180 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించింది. దీంతో నిధులు లేక రూసా పనులు ముందుకు సాగడం లేదు. బిల్లులు ఇస్తేనే చేస్తామంటూ గుత్తేదారులు నిర్మాణాలను మధ్యలోనే వదిలేశారు. కేంద్రం ఇచ్చిన నిధులివ్వాలని ఆర్థికశాఖను కళాశాల విద్యాశాఖ కోరుతున్నా స్పందించడం లేదు. రాష్ట్రానికి ఇచ్చిన నిధులను ఖర్చు చేసి, వివరాలను సమర్పిస్తేనే మిగతా వాటిని విడుదల చేస్తామని కేంద్రం చెబుతోంది. ఏం చేయాలో తెలియక రూసా అధికారులు సతమతమవుతున్నారు.

వడ్డీలకు అప్పులు తెచ్చి పనులు చేశామని, బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు గుత్తేదారులు విన్నవించారు. రూసా కింద రూ.857.43 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో శ్రీవేంకటేశ్వర, ఆంధ్ర విశ్వవిద్యాలయాలకు రూ.100 కోట్ల చొప్పున వచ్చాయి. ఇప్పటివరకు కేంద్రం రూ.563.68 కోట్లు విడుదల చేసింది. వీటిలో రూ.180 కోట్లను రాష్ట్రం ఇతర పథకాలకు మళ్లించింది. రాష్ట్రం వాటా 40శాతాన్ని కలిపి ఇవ్వాల్సి ఉండగా.. కనీసం కేంద్రం ఇచ్చిన వాటినీ ఇవ్వడం లేదు. నిధులు లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.46 కోట్ల బిల్లులు నిలిచిపోయాయి. మార్చి 31నాటికి ఈ బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌కు సమర్పించగా.. నిధులు లేవని వెనక్కి పంపించారు.

మరో పక్క కేంద్ర ప్రభుత్వం మరో రూ.58 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. మొదట, రెండు విడతల కింద ఇచ్చిన నిధులకు సంబంధించిన వినియోగ పత్రాలను సమర్పించాలని సూచించింది. అలాగే కొత్త ఆదర్శ డిగ్రీ కళాశాలలకు (ఎన్‌ఎండీసీ) రూ.12 కోట్లు, ఆదర్శ డిగ్రీ కళాశాలలకు (ఎండీసీ)రూ.4 కోట్లను కేంద్రం ఇచ్చింది. ఆ నిధులతో విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరులో చేపట్టిన కళాశాలలు, అమ్మాయిల వసతి భవనాల నిర్మాణాలు పూర్తి కాలేదు. విశ్వవిద్యాలయాల్లో కొన్ని పనులు అసంపూర్తిగా ఉన్నాయి.

ఇవీ చూడండి

Roads: గజానికో గుంత.. దారంతా చింత

గోదావరి మహోగ్రరూపం.. లంకగ్రామాలు విలవిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.