రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలకు సంబంధించి... ఆర్టీపీసీఆర్ ద్వారా చేసే టెస్టులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం రెండు రోజుల పాటు కేవలం ర్యాపిడ్ యాంటీజన్ కిట్ల ద్వారా మాత్రమే కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాల్సిందిగా వైద్యారోగ్యశాఖ సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది. వారం రోజులుగా నిలిచిపోయిన కరోనా పరీక్షల బ్యాక్ లాగ్ ను పరిష్కరించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు 1.4 లక్షల ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లను ప్రభుత్వం ఆయా జిల్లాలకు సరఫరా చేసింది. ప్రస్తుతం బ్యాక్లాగ్ లో ఉండిపోయిన కొవిడ్ పరీక్షల ఫలితాలను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
వెంటనే ఫలితాలు వచ్చేలా...
48 గంటల తర్వాత నుంచి రాష్ట్రవ్యాప్తంగా 83 ఆర్టీపీసీఆర్ యంత్రాలు, ట్రూనాట్ యంత్రాల ద్వారా కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక నుంచి వెంటనే ఫలితాలను అందించాలని, కరోనా పరీక్షల అనంతరం రోగుల గుర్తింపు, ట్రేజింగ్ ద్వారా హోమ్ ఐసోలేషన్ లేదా కోవిడ్ కేర్ కేంద్రాలకు తరలించాలని నిర్ణయించారు.
ఇవీచదవండి.