ETV Bharat / city

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ చర్యలు - ఆర్టీసీ

కొవిడ్​తో చనిపోయిన ఉద్యోగి కుటుంబాలకు ఉద్యోగాలిచ్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెలాఖరులోపు కారుణ్య నియామల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఎండీ సూచించారు. ఈ నెల 20 లోపు దరఖాస్తుల స్కృటినీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 23న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టాలని, ఈనెల 25న డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టాలని సూచించారు.

ఆర్టీసీ
ఆర్టీసీ
author img

By

Published : Nov 9, 2021, 10:23 PM IST

కొవిడ్​తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. 2020 జనవరి తర్వాత కొవిడ్​తో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఆదేశాలిచ్చారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెలాఖరులోపు కారుణ్య నియామల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఎండీ సూచించారు. బాధిత కుటుంబాలకు అర్హతలు, ఆసక్తిని బట్టి కండక్టర్​, డ్రైవర్​, శ్రామిక్​, జూనియర్​ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక చేయాలని తెలిపారు. కండక్టర్లు, డ్రైవర్లు, శ్రామిక్ ఉద్యోగాలను జిల్లాల్లోని రీజినల్ మేనేజర్లు నియామక ప్రక్రియ చేపట్టాలని, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను జోనల్ ఈడీ స్థాయిలో నియామకాలు చేపట్టాలని తెలిపారు.

ఈ నెల 20 లోపు దరఖాస్తుల స్క్రూట్నీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 23న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టాలని, ఈనెల 25న డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అభ్యర్థులకు ఈనెల 27న మెడికల్ పరీక్షలు నిర్వహించాలని తెలియజేశారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 30న నియామకపత్రాలు అందించాలని ఎండీ ఆదేశించారు.

ఇదీ చదవండి: RESULTS : ఫలితాలు విడుదల... ఉత్తీర్ణుల్లో మహిళలే అత్యధికం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.