vijayawada roads: చూశారుగా దుమ్ము, ధూళి..! గోతులు, కంకరరాళ్లు.. ఇదేమీ మారుమూల పల్లె రోడ్డుకాదు.. ! మన రాజధాని నగరంగా చెప్పుకుంటున్న విజయవాడలోని పైపుల రోడ్డు..! ఏడాదిన్నరగా ఇక్కడ వాహనదారులు రోడ్లపై కాదు ఈ గోతుల్లోనే ప్రయాణిస్తున్నారు. ఈ గోతుల నుంచి గట్టెక్కించాలని ప్రజలు మొరపెట్టుకుంటే.. చివరకు అతుకులతో సరిపెట్టారు. ఆ ప్యాచ్‌లు కూడా ఇదిగో ఇలా వేసిన రెండ్రోజులకే రాళ్లు తేలాయి. వాహనదారులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. పైపుల రోడ్డంటేనే ఆటోవాలాలు బెంబేలెత్తిపోతున్నారు.
సింగ్ నగర్‌లో ప్రారంభమయ్యే పైపుల రోడ్డు కండ్రిక వద్ద ముగుస్తుంది. ఇటు నున్న వైపు వెళ్లే రోడ్డుకు.. అటు నూజివీడు వెళ్లే రహదారికి ఇదే కూడలి. ఫలితంగా భారీ వాహనాలన్నీ ఇటుగానే వెళ్తాయి. ఇందులో చాలా వరకు రోడ్డంతా అతుకుల బొంతలాగే ఉంది.
కండ్రిక, సింగ్ నగర్ ప్రాంతాల నుంచి నగరంలోకి వెళ్లేవాళ్లు ఈ దారిలోనే వెళ్తుంటారు. నూజివీడు ప్రధాన రహదారీ ఇదే కావడంతో టిప్పర్లు, లారీలు ఇతర భారీ వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా పెద్దపెద్ద గోతులు తేలాయి. ఆ గుంతల్లో కంకర, మట్టి వేసి మమ అనిపించారు. వాహనాల తాకిడికి దుమ్ములేస్తోంది. ఎదురేం వస్తోందో కళ్లు కనిపించడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఎన్నోప్రమాదాలకు సాక్ష్యంగా మిగలడం తప్ప ఏమీ చేయలేకపోతున్నామని దుకాణదారులు చెబుతున్నారు. రోడ్లపై లేచిన దుమ్మంతా ఇళ్లల్లోకి చేరుతోంది. ఇంకెన్నిరోజులకు రోడ్లు బాగుపడతాయో అర్థం కావడం లేదని స్థానికులు తలపట్టుకుంటున్నారు.
ఇదీ చదవండి..AP CORONA CASES : భారీగా పెరిగిన కరోనా కేసులు... కొత్తగా 4,348మందికి పాజిటివ్