విజయవాడకు కేఎల్ రావునగర్కు చెందిన గౌరీశంకర్, సాయిసుధా దంపతులు. పేదరికానికి తోడు వీరికి మతిస్థిమితంలేని కుమారుడు ఉన్నాడు. ఉండటానికి గూడులేక, తినటానికి తిండిలేక గత కొంత కాలంగా రైల్వే అప్యాడ్లో తలదాచుకుంటున్నారు. వీరికి వివాహిత అయిన ఒక కూతురు ఉన్నప్పట్టికి ఆమె ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రం కావటంతో భారం కాకుడదని భావించారు.
గతకొంత కాలంగా రైల్వే అప్యాడ్లో తలదాచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరి పరిస్థితి చూసి ఎవరైనా నగదు సాయం చేస్తామంటే వద్దని నిజాయితీగా తిరస్కరించేవారు. అప్పట్లో ఉన్నత చదువులు చదివిన వీరు బిచ్చమెత్తడానికి మననసు రాక ఆకలితో అలమటిస్తున్నారు. వీరి దయనీయ స్థితిపై ఈనాడులో ప్రచురితమైన 'కష్టపడే శక్తి లేదు.. బిచ్చమెత్తే మనసు రాదు'కథనానికి స్పందించిన పలువురు దాతలు వారిని ఆదుకోవటానికి ముందుకొచ్చారు.
రైల్వే పోలీస్ ఎస్ఐ తిరుపతిరావుతో పాటు పోలీసు సిబ్బంది, స్థానికులు, గన్నవరం ప్రాంతానికి చెందిన పవన్ వృద్ధాశ్రమం నిర్వాహకులు స్పందించి వారి ఆలనా పాలనా చూస్తావని ముందుకొచ్చారు.