రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఫాక్స్‌కాన్ సంస్థ(FOXCONN MOBILES) ప్రతినిధులకు ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రతినిధులు సీఎంను కలిశారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జోష్ పాల్గర్, కంపెనీ ప్రతినిధి లారెన్స్..రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ కంపెనీ(FOXCONN EXECUTIVES MET CM JAGAN) విస్తరణ, పెట్టుబడులపై సీఎంతో చర్చించారు.
కొవిడ్ కష్టకాలంలోనూ నెల్లూరు జిల్లా తడ, శ్రీ సిటీలో తమ ప్లాంటు నిర్వహణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందని మేనేజింగ్ డైరెక్టర్ జోష్ పాల్గర్ అన్నారు. సంస్థ పురోభివృద్ధికి సహకరిస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ ముఖ్యకార్యదర్శి జి. జయలక్ష్మి, వైయస్సార్ ఈఎంసీ, సీఈఓ నందకిషోర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: