ETV Bharat / city

letter to assembly secretary: చట్టసభల్లో ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలి: అనగాని సత్యప్రసాద్

అసెంబ్లీలో ఇద్దరు తెదేపా నేతల మైక్ కట్ చేయాలని(Mike Cut For 2 TDP Leaders) సభాహక్కుల సంఘం చేసిన తీర్మానంపై పునరాలోచించాలని కమిటీ సభ్యులు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కోరారు. చట్టసభల్లో ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలని స్పష్టంచేశారు. ఈమేరకు అసెంబ్లీ కార్యదర్శికి లేఖ(mla sathyaprasad letter to assembly secretary) రాశారు.

mla sathyaprasad letter to assembly secretary
రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
author img

By

Published : Sep 23, 2021, 12:55 PM IST

అసెంబ్లీలో తెదేపా శాసనసభాపక్ష ఉపనేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుల మైక్ కట్ చేయాలని(Mike Cut For 2 TDP Leaders at assembly) సభాహక్కుల సంఘం చేసిన తీర్మానంపై పునరాలోచించాలని కమిటీ సభ్యులు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(repalle mla sathyaprasad) కోరారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి లేఖ(mla sathyaprasad letter to assembly secretary) రాశారు. "ప్రతిపక్షానికి ఉన్న బాధ్యతలో భాగంగా సభ దృష్టికి ప్రజాసమస్యలు తీసుకొచ్చి, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించటాన్ని నేరంగా, ఘోరంగా భావిస్తున్నారు. ప్రజాసమస్యల పరిష్కార వేదికైన అసెంబ్లీలో ఇద్దరు ప్రతిపక్షనేతలకు మాట్లాడే అవకాశం లేకుండా చేయటడం సరికాదు. సభ్యుల వివరణ తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. విపక్షాలను శత్రువులుగా చూసే విధానం సమర్థనీయం కాదు. రాజ్యంగం కల్పించిన మాట్లాడే హక్కును నిర్వీర్యం చేసేలా, చట్ట సభల్లో మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు. ప్రస్తుత అధికార పార్టీ నేతలు ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. స్పీకర్ పోడియం ఎక్కి ఆందోళనలు చేయలేదా..? ప్రజాస్వామ్య దేవాలయమైన చట్టసభల్లో ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలి. సభాహక్కుల సంఘానికి వివరణ ఇచ్చే అవకాశం తెదేపా నేతలకు కల్పించాలి." అని లేఖలో సత్యప్రసాద్​ (mla sathyaprasad letter to assembly secretary) పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

CM jagan : అమెరికన్‌ కార్నర్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.