గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. మొత్తం పరీక్ష రాసిన అభ్యర్ధుల్లో 7.68 లక్షల మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరు 20 నుంచి 26 తేదీ వరకూ 7 రోజుల పాటు నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు గానూ 14 రకాల పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ పరీక్షల కోసం 10 లక్షల 56 వేల మంది దరఖాస్తు చేసుకోగా...7.69 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు.
ఓపెన్ కేటగిరీలో అత్యధికంగా 111 మార్కులు , బీసీ కేటగిరీలో 111 మార్కులు, ఎస్సీ కేటగిరీలో అత్యధికంగా 99.75 మార్కులు, ఎస్టీ కేటగిరీలో అత్యధికంగా 88.75 మార్కులు సాధించినట్లు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే సర్వీసులో ఉన్న వారికి మరో 15 మార్కులు అదనంగా కలుపనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం అర్హులైన వారికి రోస్టర్ ప్రకారం ఎంపిక చేసి సెలక్షన్ లెటర్‌ను పంపించనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: